చరణ్ ‘వినయ విధేయ రామ’ ఫస్ట్ లుక్ చూసారా..

మొత్తానికి బోయపాటి-రామ్ చరణ్ కాంబినేషన్ లోని వినయ విధేయ రామ సినిమా ఫస్ట్ లుక్ వచ్చేసింది. ‘రంగస్థలం’ బ్లాక్ బస్టర్ హిట్ తరువాత బోయపాటి దర్శకత్వంలో నటించిన మూవీ ఫస్ట్ లుక్‌‌తో పాటు టైటిల్‌ను విడుదల చేశారు. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్ కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. వారి ఎదురుచూపులు తగ్గట్లే ఫస్ట్ లుక్ ఉండడం తో వారంతా పండగా చేసుకుంటున్నారు. ఫస్ట్ లుక్ లో చరణ్ ఎంతో ఆవేశం గా కత్తి పట్టుకొని పరుగెడుతున్నట్లు కనిపించాడు.

ఇక నవంబర్‌ 9న టీజర్‌ను విడుదల చేయనున్నట్లు ఫస్ట్ లుక్ పోస్టర్ లో ప్రకటించారు.ఇక ఈ మూవీ లో చరణ్ కు జోడిగా కియారా అడ్వాణీ నటిస్తుండగా , బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ విలన్ రోల్ లో కనిపిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.