‘వినయ విధేయ రామ’ ఏరియా వైజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తారా..?

సంక్రాంతి బరిలో రాబోతున్న హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘వినయ విధేయ రామ’ . రామ్ చరణ్ – బోయపాటి శ్రీను కలయికలో తెరకెక్కిన ఈ మూవీ ఫై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. రంగస్థలం తర్వాత చరణ్ నుండి వస్తున్న సినిమా కావడం, అలాగే బోయపాటి డైరెక్షన్లో మొదటిసారి నటించడం తో ఈ సినిమా గత రికార్డ్స్ బ్రేక్ చేస్తుందని అభిమానులు ధీమా గా ఉన్నారు. ఆ అంచనాలకు తగ్గట్లే అన్ని ఏరియాల ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరిగినట్లు తెలుస్తుంది.

వరల్డ్ వైడ్ గా థియేట్రికల్ రైట్స్ బిజినెస్ 94 కోట్ల రూపాయల మార్కును టచ్ చేసినట్లు తెలుస్తుంది. టాలీవుడ్ లో హయ్యెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాల లిస్టులో ‘వినయ విధేయ రామ’ కు ఐదవ స్థానం దక్కింది.

ఓ సారి ఆ బిజినెస్ డీటెయిల్స్ చూస్తే..

ఏరియా బిజినెస్
నైజాం 20 కోట్లు
సీడెడ్ 15 కోట్లు
ఉత్తరాంధ్ర 11.70 కోట్లు
ఈస్ట్ 7.20 కోట్లు
వెస్ట్ 5.60 కోట్లు
కృష్ణ 6 కోట్లు
గుంటూరు 7.80 కోట్లు
నెల్లూరు 3.30 కోట్లు
టోటల్(ఏపీ + తెలంగాణా) 77 కోట్లు
రెస్ట్ అఫ్ ఇండియా 8.50 కోట్లు
ఓవర్సీస్ 9 కోట్లు
వరల్డ్ వైడ్ టోటల్ 94.10 కోట్లు