27న పాటలు ‘గుసగుసలాడే’ !

vuhalu
నటుడు శ్రీనివాస్ అవసరాల దర్శకుడిగా మారి రూపొందిస్తున్న తోలి చిత్రం ‘ఊహలు గుసగుసలాడే’. సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని వారాహి చలన చిత్రం బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. నాగ సౌర్య, రాశి ఖన్నా ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో హీరో, హీరోయిన్స్ . ఈ సినిమా ఆడియో విడుదల ఈనెల 27న వైభవంగా జరగనుంది. కళ్యాణి కోడూరి ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇక, ఇటీవలే రిలీజ్ అయిన ఈ చిత్రం ట్రైలర్ బాగానే ఆకట్టుకుంది. మరి, చిత్రం ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.