వరల్‌ ఫేమస్‌ లవర్‌ ఎప్పుడో తెలుసా ?


సెన్సేషనల్‌ స్టార్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం వరల్‌ ఫేమస్‌ లవర్‌. ఇటీవల డియర్‌ కామ్రేడ్‌ సినిమాతో నిరాశపరిచిన విజయ్‌, ఈ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. క్లాస్‌, ఎమోషనల్‌ సినిమాల దర్శకుడు క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్‌ దేవరకొండ మూడు డిఫరెంట్‌ లుక్స్‌లో కనిపించనున్నాడు.

ఈ సినిమాని వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న లవర్స్ డే రోజున విడుదల చేయనున్నారు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా కోసం రాశీఖ‌న్నా మొదటసారి తన పాత్రకు స్వయంగా డబ్బింగ్ చెబుతుంది. ఈ చిత్రానికి సంగీతం గోపి సుందర్ అందిస్తున్నారు. కె.ఎస్‌.రామారావు స‌మ‌ర్ప‌ణ‌లో క్రియేటివ్ క‌మ‌ర్షియల్స్ బ్యాన‌ర్‌ పై కె.ఎ.వ‌ల్ల‌భ ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు.