డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో దుమ్ములేపుతున్న ఫేమస్ లవర్..

లాక్ డౌన్ OTT సంస్థలకు , అలాగే టీవీ చానెల్స్ కు మంచి రాబడి తెస్తుంది. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ తో ప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారు. ఇంట్లోనే టీవీ లకు కొంతమంది హత్తుకుంటే మరికొంతమంది మాత్రం డిజిటల్ సంస్థలకు హత్తుకుపోయారు. డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లలో వచ్చే సరికొత్త సినిమాలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికే పలు సినిమా మంచి వ్యూస్ , టిఆర్పీ రేటింగ్ సాధించగా..తాజాగా విజయ్ ప్లాప్ మూవీ వరల్డ్ ఫేమస్ లవర్ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో దుమ్ములేపుతుంది.

విజయ్ దేవరకొండ , రాశీఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరిన్, ఇజాబెల్లె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. క్రాంతి మాధవ్ డైరెక్ట్ చేయగా.. గోపీ సుందర్ సంగీతం అందించారు. కె.ఎస్.రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై కె.ఎ.వల్లభ ఈ చిత్రాన్ని నిర్మించారు.

భారీ అంచనాల మధ్య ఫిబ్రవరి 14 న రిలీజ్ అయినా ఈ మూవీ అంచనాలను అందుకోవడం లో విఫలం అయ్యింది. మొదట రోజు మొదటి షో తోనే నెగిటివ్ టాక్ రావడం తో ఆ ఎఫెక్ట్ సినిమా కలెక్షన్ల ఫై భారీగా పడింది. దీంతో బయ్యర్లకు భారీ నష్టాలే వచ్చాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లోకి వచ్చింది. నెట్ ఫ్లిక్స్ మరియు సన్ నెక్ట్స్ లో ఈ చిత్రాన్ని చూసి ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. అంతేకాదు ఏకంగా ఈ చిత్రం ఇండియా వైడ్ గా సెకండ్ పోజిషన్ లో ట్రెండ్ అవుతుంది.

వరల్డ్ ఫేమస్ లవర్ డిజిటల్ హక్కులను ప్రఖ్యాత స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. అందులో భాగంగా నెట్ ఫ్లిక్స్ రెండు రోజుల క్రితం ఈ మూవీని నెట్ ఫ్లిక్స్ తన సబ్‌స్క్రైబర్స్‌కు అంబాటులోకి తెచ్చింది. దీంతో బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకోలేకపోయిన వరల్డ్ ఫేమస్ లవర్ డిజిటల్‌లో విశేష ఆదరణ దక్కించుకుంటూ ఇండియా వైడ్ గా నెట్ ఫ్లిక్స్ లో టాప్‌లో ట్రెండ్ అవుతూ సంస్థకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఇక్కడ మరో విషయం ఏమంటే విజయ్ దేవరకొండ గత చిత్రం డియర్ కామ్రేడ్ కూడా థియేటర్స్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా ఓ టి టి ప్లాట్ ఫార్మ్ లో విజయం సాధించింది