గుర్రం ఎగిరేది ఎప్పుడో.. !!

gurramసుమంత్ హీరోగా చంద్ర సిద్ధార్థ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఏమో గుర్రం ఎగరావచ్చు’. ఈరోజే థియేటర్లో ఎగరాల్సివుంది.. కానీ ఎగరలేదు. ఇందుకు ఫైనాన్స్ సమస్యలే కారణమట. ఆర్ధిక సాయం చేసిన ఫైనాన్షియర్లు అభ్యంతరం పెట్టడం వల్లే గుర్రం ఈరోజు ఎగరలేదట. ప్రస్తతం దీనికి సంబంధించిన పంచాయితీ నడుస్తుంది. రేపటిలోగా.. పంచాయితీ పరిష్కారమైతే గుర్రం రేపైనా ఎగిరే అవకాశం వుంది. లేదంటే… ఎప్పుడు ఎగురుతుందానని వేచి చూడక తప్పదు మరీ..