గాంధీ ఆసుపత్రి వైద్యుడికి కరోనా సోకిందా ?

చైనాలో కరోనా బారిన పడి ఇద్దరు డాక్టర్లు కూడా మృతి చెందిన సంగతి తెలిసిందే. కరోనా రోగులకి చికిత్స అందిస్తున్న క్రమంలో వీరికి కరోనా సోకింది. చికిత్స తీసుకున్న తగ్గలేదు. చివరికి ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు గాంధీ ఆసుపత్రిలోనూ ఓ వైద్యుడుకి కరోనా సోకినట్టు సమాచారమ్.

దుబాయ్‌ నుంచి బెంగళూరుకు వచ్చిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగికి కరోనా వైరస్‌ పాజిటివ్‌ వచ్చిన విషయం విదితమే. అతడికి గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఉద్యోగితో కలిసిమెలిసి తిరిగిన 88 మందికి కూడా కరోనా వైరాస్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీరిలో 45 మందికి కరోనా వైరస్‌ సోకలేదని గాంధీ వైద్యులు స్పష్టం చేశారు.

అయితే గాంధీ ఐసోలేషన్‌ వార్డులో కరోనా బాధితుడికి చికిత్స అందిస్తున్న వైద్యుడికి కూడా ఈ వైరస్‌ సోకినట్లు తెలుస్తోంది. వైద్యుడి రక్త నమూనాలను పుణె ల్యాబ్‌కు పంపించారు. ఆ ఫలితాలు ఇవాళ వచ్చే అవకాశం ఉంది.