31జిల్లాల తెలంగాణ.. నా బంగారు తెలంగాణ !

telangana1
తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు కసరత్తు అంకానికి చేరుకుంది. జిల్లాల వారీగా స్థానిక నేతలతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్షించారు. కరీంనగర్‌, వరంగల్‌, ఆదిలాబాద్‌, ఖమ్మం, హైదరాబాద్‌ జిల్లా నేతలతో కేసీఆర్ విస్తృతంగా చర్చించారు. తాజా చర్చలతో మరో 4జిల్లాల ఏర్పాటుకి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. కొత్తగా సిరిసిల్ల, జనగాం, గద్వాల్, ఆసిఫాబాద్‌ జిల్లాల ఏర్పాటుకు కేసీఆర్ సానుకూలత వ్యక్తం చేశారు. 31 జిల్లాల ఏర్పాటుకు అనుగుణంగా కసరత్తు జరపాలని నిర్ణయించారు.

కొత్త జిల్లాలు ఇవే :

వరంగల్‌- 5 జిల్లాలు :
వరంగల్‌ అర్బన్‌
వరంగల్‌ రూరల్‌
భూపాలపల్లి
మహబూబాబాద్‌
జనగాం

కరీంనగర్‌ – 4 జిల్లాలు :
కరీంనగర్‌
జగిత్యాల
పెద్దపల్లి
సిరిసిల్ల

మహబూబ్‌నగర్‌- 4 జిల్లాలు :
మహబూబ్‌నగర్‌
నాగర్‌కర్నూలు
వనపర్తి
గద్వాల

మెదక్‌-3 జిల్లాలు :
మెదక్‌
సిద్దిపేట
సంగారెడ్డి

రంగారెడ్డి-3 జిల్లాలు :
శంషాబాద్‌
వికారాబాద్‌
మల్కాజ్‌గిరి

నల్గొండ-3 జిల్లాలు :
నల్గొండ
యాదాద్రి
సూర్యాపేట

ఆదిలాబాద్‌-4 జిల్లాలు :
ఆదిలాబాద్‌
మంచిర్యాల
నిర్మల్‌
ఆసిఫాబాద్‌

నిజామాబాద్‌-2 జిల్లాలు :
నిజామాబాద్‌
కామారెడ్డి

ఖమ్మం-2 జిల్లాలు :
ఖమ్మం
కొత్తగూడెం

హైదరాబాద్‌ యథావిధిగా కొనసాగనుంది.