ఉత్తమ ముఖ్యమంత్రి చంద్రబాబుc

Chandrababu-Another-Foreign-Tour-Confirmedఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి పరిపాలనలో యమ స్ట్రిక్టు అని పేరుంది. అధికార యంత్రాంగాన్ని జెడ్ స్వీడుతో పరిగెత్తిస్తుంటాడు. చంద్రబాబు వేగాన్ని అందుకోవడం మా వల్ల కాదాని కొందరు ఐపీఎస్ అధికారులే వాపోతుంటారు. ఆయన నిద్రపోరు.. మరొకరిని (అధికారులను) నిద్రపోయినివ్వరు. ఒక్క మాటలో చెప్పాలంటే అభివృద్ధి కేరాఫ్ అడ్రస్ అంటే చంద్రబాబు పేరే చెబుతుంటారు. అలాంటి పేరున్న చంద్రన్నకు ఓ అరుదైన ఘనత దక్కింది. చంద్రబాబుకు ఆదర్శ ముఖ్యమంత్రి పురస్కారం దక్కింది. పుణె కు చెందిన భారతీయ ఛాత్ర సంసద్ సంస్థ ఈ పురస్కారాన్ని అందజేసింది. రైతు, సంక్షేమ, రాష్ట్ర అభివృద్ధికి చేస్తోన్న విశేష కృషికి గానూ చంద్రబాబుకు ఈ పురస్కారానికి ఎంపికయ్యారు.