తెలంగాణపై నిర్ణయం ప్రకటించండి..!

Ajit-Singhతెలంగాణ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని రాష్ట్రీయ లోకదళ్ అధ్యక్షుడు అజిత్ సింగ్ పేర్కొన్నారు. ఈరోజు (శుక్రవారం) ఎంపీ వివేక్, మాజీ రాజ్యసభ సభ్యుడు   కేకే అజిత్ సింగ్ తో సమావేశమయ్యారు. అనంతరం అజిత్ సింగ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ర్టం ఏర్పాటు దిశగా నిర్ణయం తీసుకున్నట్లయితే… సీమాంధ్రలో ఆందోళనలు చెలరేగిన అవి ఒకటి రెండు నెలల్లో తగ్గుపోతాయని అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ర్టం ఏర్పడని యెడల ఆందోళనలు నిరంతరం కొనసాగే అవకాశం ఉందని ఆయన తెలిపారు. తెలంగాణ ఏర్పాటు దిశగా నిర్ణయం తీసుకుంటేనే మంచిదనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.

తెలంగాణ కోసం యూపిఏ భాగస్వామ్యపక్షాలు అన్నీ కలిసి కాంగ్రెసు పార్టీ పైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేయాలని, ఆదిశగా తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు చొరవ తీసుకోవాలని కోరారు. గత రెండు సంవత్సరాలుగా కాంగ్రెసు పార్టీ తెలంగాణపై సంప్రదింపులు జరుపుతూనే ఉందని విమర్శించారు. కాగా, ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పార్టీని వీడేదిలేదని, తొమ్మిదేళ్లుగా పార్టీలోనే ఉంటూ తెలంగాణ కోసం ఉద్యమిస్తున్నాన ని కేకే తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల మధ్య ఎలాంటి భేధాభిప్రాయాలు లేవని అన్నారు. తెలంగాణ రాష్ర్టం ఏర్పడేవరకు అందరిని కలుపుకొని ముందుకు వెళతామని కేకే స్పష్టం చేశారు.