మార్చి 16 నుండి బాబు ప్రచారం..

ఎన్నికల గడువు తేదీ ప్రకటన రావడం తో అన్ని పార్టీలు తమ అభ్యర్థుల ప్రకటన ఫై ఫోకస్ చేసాయి. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఈరోజు తొలి జాబితాను విడుదల చేస్తుండగా , టీడీపీ పార్టీ తొలి జాబితాను గురువారం విడుదల చేయనున్నారు. ఈ జాబితాలో 100 నుంచి 140 మంది పేర్లతో ఈ జాబితాను ప్రకటిస్తారనే ప్రచారం సాగుతోంది. మరోపక్క జనసేన పార్టీ సైతం తొలి జాబితాను ఈరోజు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.

ఇక తెలుగుదేశం అధినేత , ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు తన ప్రచారానికి సిద్దమవుతున్నాడు. మార్చి 16 నుండి ఎన్నికల ప్రచారం మొదలు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే టీడీపీ నేతలు ప్రచార ప్లాన్ ను సిద్ధం చేసే పనిలో ఉన్నారు. మార్చి 16 ఉదయం తిరుపతిలో స్వామి వారిని బాబు దర్శించుకుంటారు.

మధ్యాహ్నం ఒంటి గంటకు తిరుపతిలో సేవామిత్ర, బూత్ కమిటీలతో సమావేశమవుతారు. అదే రోజు సాయంత్రం శ్రీకాకుళం సభలో పాల్గొంటారు. 17న విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో.. 18న నెల్లూరు, గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో.. 19న కర్నూలు, అనంతపురం, కడప జిల్లాలో సభలు నిర్వహిస్తారు చంద్రబాబు. ఈ సభల తర్వాత బస్సు యాత్ర ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నారు. ఈ ఎన్నికల్లో ‘మీ భవిష్యత్తు – నా బాధ్యత’ అనేది టీడీపీ నినాదంగా ప్రకటించిన చంద్రబాబు, ‘మీ జైలుకు – నా భరోసా’ అనేది జగన్‌ నినాదమని ఎద్దేవా చేసిన విషయం తెలిసిందే.