వైసీపీ తో జనసేన పొత్తు..?

ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు మారబోతున్నాయా..? ఒంటరి అనుకున్న వారు కలవబోతున్నారా…? చంద్రబాబు ను ఓడించేందుకు మాస్టర్ ప్లాన్ వేసారా..? ఇక బాబు పని అయిపోయినట్లేనా…? రాబోయేది జగన్ రోజులేనా..? ప్రస్తుతం ఇవే మాటలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాట్లాడుకుంటున్నారు. మొన్నటి వరకు జనసేన , వైసీపీ పార్టీలు వేరు వేరుగా ఎన్నికల బరిలో దిగబోతున్నాయని ప్రచారం జరిగింది. కానీ ప్రస్తుతం మాత్రం వైసీపీ – జనసేన పొత్తుగా బరిలోకి దిగబోతున్నాయని అంటున్నారు.

తాజాగా హైదరాబాద్ లో కొంతమంది వైసీపీ కీలక నేతలు – జనసేన నేతలు సమావేశమై పొత్తు గురించి మాట్లాడినట్లు తెలుస్తుంది. జగన్ కొన్ని సీట్లను జనసేనకు కేటాయించాలని.. ఉభయ గోదావరి జిల్లాల్లో కొన్ని సీట్లను జనసేన కోసం త్యాగం చేయాలని.. ఇరువురూ ఒక రాజీ ఫార్ములాకు రావాలని ఆ నేతలు మాట్లాడుకున్నట్లు సమాచారం. జగన్ – పవన్ లు కలిస్తే తెలుగుదేశం పార్టీ అడ్రస్ ఉండదని.. వారు అభిప్రాయపడినట్టుగా సమాచారం. ఈ విషయంలో జగన్ కు – పవన్ కు సలహా ఇవ్వాలని.. పొత్తుకు చేతులు కలపాల్సిందిగా కోరాలని ఆ ఇరు నేతలు భావిస్తున్నారట.

మరి వారి కోరిక పట్ల పవన్ – జగన్ ఏమంటారో చూడాలి. వాస్తవానికి ప్రస్తుతం సమయం చాల తక్కువగా ఉంది. ఏ నిర్ణయం తీసుకున్న త్వరగా తీసుకోవాలి. మరి వీరిద్దరూ కలుస్తారో లేదో చూద్దాం.