లగడపాటి సర్వే రిపోర్ట్

లగడపాటి రాజగోపాల్‌ పోలింగ్ సర్వే చెప్పాడంటే అది ఖచ్చితంగా జరుగుతుందని అంత భావిస్తారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో జరిగిన శాసన సభ ఎన్నికల్లో రాజగోపాల్‌ లెక్క తప్పింది..మహాకూటమి భారీ విజయం సాదిస్తుందని సర్వే ఇచ్చాడు కానీ మహాకూటమి అడ్రస్ లేకుండా పోయింది. రాజగోపాల్‌ సర్వే ను నమ్మి కోట్ల బెట్టింగ్ చేసారు..ఫలితాల అనంతరం అందరికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు తెలంగాణ ప్రజలు.

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలింగ్ ఫై సర్వే ఇచ్చారు. వెలగపూడిలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సైకిల్ కు…తెలంగాణ రాష్ట్ర ప్రజలు కార్ కు ఓట్ వేశారని..ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని 90-93శాతం ఓటర్లు తెదేపా, వైకాపా, జనసేన పార్టీలకే ఓట్లేశారని అన్నారు. మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణలో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేనందున అక్కడ ఓటర్లు కారు ప్రయాణాన్నే కోరుకున్నారని, లోటు బడ్జెట్‌, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఏపీ ఓటర్లకు వారికున్న పరిస్థితుల రీత్యా సైకిలే మార్గమైందని ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్ లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశమే లేదని, పూర్తి ఆధిక్యతతోనే ఒక పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని వ్యాఖ్యానించారు. తెలుగు ప్రజల తీర్పు ఎప్పుడూ స్పష్టంగా ఉంటుందే తప్ప గజిబిజిగా ఉండదని, ఈ సారీ అలాగే స్పష్టమైన ఆధిక్యతతో ఒక పార్టీకి పట్టం కట్టబోతున్నారని వివరించారు. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ కంటే, ఆయన తమ్ముడు స్థాపించిన జనసేన పార్టీకి తక్కువ స్థానాలు వస్తాయని, పవన్‌ కల్యాణ్‌ శాసనసభలో అడుగుపెడతారని తెలిపారు