ఏపీ ఎన్నికల ఖర్చు లో మంగళగిరి టాప్ ..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ 11 న సార్వత్రిక ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం ప్రధాన పార్టీ లు తెలుగు దేశం , వైస్సార్సీపీ , జనసేన మూడు కూడా భారీ ఎత్తునే ఖర్చు చేసాయి. కొన్ని చోట్ల ఓటు కు రెండు వేలు నుండి మూడు వేల వరకు కూడా ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. మొత్తం మీద ఏపీ ఎన్నికల్లో భారీ ఎత్తున ఖర్చు చేసింది మంగళగిరి నియోజకవర్గం అని తాజా సర్వే లో తేలింది.

ఈ నియోజకవర్గం నుండి నారా చంద్రబాబు తనయుడు లోకేష్ బరిలోకి దిగాడు. మొదటిసారి లోకేష్ ఎన్నికల బరిలో నిల్చోవడం తో చంద్రబాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తనయుడి గెలుపు కోసం భారీ ఎత్తున ఖర్చు చేసినట్లు తెలుస్తుంది. రెండవ స్థానంలో నెల్లూర్ అర్భన్ ఉంది. ఇక్కడ అభ్యర్తుల మధ్య గట్టి పోటీ నెలకొనడంతో ఒకరికొకరు పోటీ పడి మరీ ఖర్చుపెట్టారట.

మహిళా ఓటర్లకు వెండితో చేసిన కుంకుమ భరణీలను పంపిణీ చేసినట్లు తేలింది. ఇక మూడవ స్థానంలో అద్దంకి ..నాలుగో స్థానంలో గుడివాడ.. ఐదో స్థానంలో విశాఖ నార్త్ నిలిచింది. మొత్తం మీద మాత్రం బరిలో నిల్చున్న అభ్యర్థులు గెలుపు కోసం వారి ఖజానా మొత్తం ఖాళీ చేసినట్లు చెప్పొచ్చు. సరే గెలిస్తే అవి ఎంతలో తెచ్చుకోవచ్చు కానీ ఓడిపోయినా అభ్యర్థులకే కష్టాలు.