మచిలీపట్నం ఎంపీ బరిలో వంగవీటి..

గత కొద్దీ రోజులుగా వంగవీటి రాధ దారి ఎటు అని అంత అయోమయంలో ఉన్నారు..వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పిన వంగవీటి ..మళ్లీ వైసీపీ పార్టీ లోకి చేరుతారా..లేక తెలుగుదేశం పార్టీ లో చేరుతారా అనే ఆసక్తి అందరిలో నెలకొని ఉండగా..తాజాగా ఆయన టీడీపీకే మొగ్గు చూపినట్లు తెలుస్తుంది. సోమవారం రాత్రి రాధ, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ తెలుగుదేశం అధినేత చంద్రబాబును కలిశారు.

సుజనాచౌదరి వీరిద్దరిని చంద్రబాబు వద్దకు తీసుకెళ్లారు. వీరితో మాట్లాడిన బాబు..రాధకు మచిలీపట్నం ఎంపీ టికెట్‌ ఇచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. వంగవీటికి టికెట్‌ ఇస్తే మచిలీపట్నం సిట్టింగ్‌‌ ఎంపీ కొనకళ్ల నారాయణను పెడన శాసనసభ స్థానం నుంచి బరిలోకి దించే అవకాశం ఉంది. త్వరలోనే రాధ టికెట్ పట్ల అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

ఏప్రిల్ 11 న రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్న సమయంలో అన్ని పార్టీ లు ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. తమ పార్టీలకు సంబందించిన అభ్యర్థుల లిస్ట్ ను ప్రకటించే పనిలో ఉన్నాయి. వైసీపీ ఈరోజు గాని రేపు గాని మొదటి లిస్ట్ ను ప్రకటించబోతున్నట్లు సమాచారం. జనసేన తొలి విడతగా శాసనసభకు పోటీ చేసే 32 మంది అభ్యర్థులు, 9 మంది ఎంపీ అభ్యర్థులతో కూడిన జాబితాను విడుదల చేసే పనిలో ఉంది.

ఇప్పటికే అమలాపురం లోక్‌సభ స్థానం నుంచి డీఎంఆర్ శేఖర్, రాజమండ్రి నుంచి డాక్టర్ ఆకుల సత్యనారాయణ పోటీ చేస్తున్నారని పవన్ ప్రకటించారు. ఈ రెండు స్థానాల్లో జనసేన విజయం ఖాయమని పవన్ ధీమా వ్యక్తం చేసారు. డీఎంఆర్ శేఖర్ సోమవారం జనసేనలో చేరారు. ఆయనకి పవన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలోకి ఆహ్వానించిన వెంటనే ఆయన్ని అమలాపురం అభ్యర్థిగా ప్రకటించడం విశేషం.