తెలుగుదేశం అధినేత..ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను సోషల్ మీడియా లో ఓ అట ఆడుకుంటున్నాడు వర్మ. ఇప్పటికే భారీ ఓటమి తో బాధపడుతున్న తెలుగుదేశం శ్రేణులు మరింత బాధపెడుతున్నాడు వర్మ..సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ భారీ ఓటమి చవిచూసిన దగ్గరి నుండి వర్మ తన రివెంజ్ ను తీర్చుకుంటున్నాడు.
‘ప్రస్తుతం పరిస్థితి ఇదీ..’అంటూ ట్విట్టర్ ద్వారా ఓ సెటైరికల్ వీడియోను షేర్ చేశారు. సదరు వీడియోలో చంద్రబాబును పోలిన ఓ వ్యక్తి హోటల్లో సర్వర్గా పనిచేస్తుండటం గమనార్హం. అధికారానికి దూరమైన టీడీపీ అధినేత చంద్రబాబుపై వర్మ ఈ రకంగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఇది మాత్రమే కాదు నిన్నటి నుండి రకరకాల పిక్స్ , వీడియోస్ షేర్ చేస్తూ వస్తున్నాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలను అడ్డుకున్న అంశాన్ని ప్రస్తావిస్తూ రాంగోపాల్ వర్మ ఘాటు విమర్శలు చేశారు. ‘నిన్న రాత్రి స్వర్గీయ ఎన్.టీ.ఆర్ గారు నా కలలోకి వచ్చారు. లక్ష్మీస్ ఎన్.టీ.ఆర్. విడుదల ఆపినందుకే CBN ని దారుణంగా ఒడిపోయేలా చేశానని చెప్పారు’ అంటూ మరో ట్వీట్ చేశారు.
Present position pic.twitter.com/gXB0wpmyTn
— Ram Gopal Varma (@RGVzoomin) 24 May 2019
నిన్న రాత్రి స్వర్గీయ ఎన్.టీ.ఆర్ గారు నా కలలోకి వచ్చి లక్ష్మీస్ ఎన్.టీ.ఆర్ విడుదల ఆపినందుకే CBN ని దారుణంగా ఒడిపోయేలా చేశానని చెప్పారు. pic.twitter.com/5oOZfpUjm5
— Ram Gopal Varma (@RGVzoomin) 24 May 2019