జేడీ లెక్కల ఫై విజయసాయి ఎద్దేవా..

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు పూర్తి అయ్యాయి..పోలింగ్ తర్వాత ఫలితాలకు 41 రోజలు గ్యాప్ రావడం తో ఎవరికీ వారు తమ గెలుపు ఫై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు 130 స్థానాల్లో గెలుస్తున్నామని చెపుతున్నారు. మరోపక్క వైసీపీ 130 స్థానాల్లో భారీ మెజార్టీ తో గెలుపొందుతున్నామని చెపుతున్నారు. ఇలా ఎవరికీ వారు తమ గెలుపు స్థానాలపై ధీమా వ్యక్తం చేస్తుంటే..జనసేన పార్టీ లో చివరిలో చేరి ఎంపీ టికెట్ పొంది ఇప్పుడు గెలుపు బాటలో ఉన్న జేడీ లక్ష్మి నారాయణ తమ పార్టీ 88 స్థానాల్లో గెలుస్తుందని చెప్పడం పట్ల వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఎద్దేవా చేసారు.

జనసేన సొంతంగా పోటీచేసిందే 65 స్థానాల్లో అలాంటిది 88 స్థానాల్లో ఎలా గెలుస్తుందని ట్విట్టర్ ద్వారా వ్యక్తం చేసారు. ‘సొంతంగా పోటీ చేసిందే 65 సీట్లలో. పవన్ కళ్యాణ్ అనుంగు అనుచరుడు జేడీ లక్ష్మీనారాయణేమో 88 స్థానాల్లో గెల్చి జనసేన పార్టీ ప్రభుత్వాన్ని స్థాపిస్తుందని జోస్యం చెబుతున్నారు. ఇతను దర్యాప్తు చేసిన కేసుల్లో కూడా ఇలాగే లేనివి ఉన్నట్టు రాసాడు. ఇది కూడా చంద్రబాబు బ్రీఫింగేనా?’ అని విజయసాయిరెడ్డి మండిపడ్డారు.