చిట్టి నాయుడుని అజ్ఞాతంలోకి పంపించాడట..

ఏపీ లో ఒకే ఒక చర్చ అదే చిట్టి నాయుడు (నారా లోకేష్ ) ఎక్కడ అని..ఎన్నికల తేదీ ప్రకటించినప్పటికీ లోకేష్ బాబు ఎక్కడ కనిపించడం లేదు. గత నెల రోజులుగా మీడియా కు కనిపించకుండా కేవలం ట్విట్టర్ తోనే చిలకపలుకులు పలుకుతున్న పప్పు బాబు ఎక్కడ అంటూ వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. తాజాగా వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వైఎస్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్‌ వేదికగా లోకేష్ , చంద్రబాబు ఫై ఓ రేంజ్ లో సెటైర్లు వేశారు.

కార్లు అమ్ముడు పోని కారణంగా కియా మోటార్స్ కంపెనీ చైనాలో అతి పెద్ద ప్లాంటును మూసేసింది. మరి అనంతపూర్‌లో ఏర్పాట‌వుతున్న‌ ప్లాంట్ సంగతేమిటో? కమిషన్ల కక్కుర్తితో కియా మోటార్స్ కు చంద్రబాబు రెండు వేల కోట్ల రాయితీలిచ్చాడు. కంపెనీ ఉద్యోగుల్లో స్థానికులు వంద మందికి మించి లేరు. ఐటీ గ్రిడ్ మూత‌ప‌డిన‌ప్ప‌టి నుంచి చిట్టి నాయుడు (నారా లోకేశ్‌) మెదడులో అమర్చిన ‘చిప్’ సిగ్నల్స్ తీసుకోవడం లేదట. ‘ERROR’ చూపిస్తోంది. అందుకే వారం రోజులుగా అజ్ణాతంలోకి పంపించాడు పెద్ద నాయుడు. డేటా దొంగ అశోక్ ప్రస్తుతం చిప్ ను యాక్టివేట్‌ చేసేందుకు విఫలయత్నం చేస్తున్నాడు.

అధికారులు ఇక నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చింది. చంద్రబాబు, ఆయన తొత్తులకు భయపడాల్సిన అవసరం లేదు. ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ముక్త కంఠంతో మార్పు కోరుకుంటున్నారు. ఈ చారిత్రక ధర్మపోరాటంలో పోలీసు, సివిల్ అధికారులంతా న్యాయం వైపు నిలవాలి. డేటా చోరీ కేసులో అడ్డంగా దొరికిన తర్వాత పప్పు నాయుడు బంకర్ లో దాక్కున్నాడా? ఎవరికీ కనిపించకుండా ఎటు వెళ్లాడు? అజ్ణాతంలో లేక పోతే మీడియా ముందు మాట్లాడాలి. మంత్రిగా జీతభత్యాలు తీసుకుంటూ ప్రజలకు అందుబాటులో లేకుండా ట్విట్టర్ మ్యాన్ అయిపోతే ఎలా? అని ఎద్దేవా చేశారు.