విభజనపై మరో అఖిలపక్షం!

Shinde1తెలంగాణపై కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే మరో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఏర్పాటు నేపద్యంలో.. ఎలాంటి మార్గదర్శకాలను అనుసరించాలన్నదానిపై రాజకీయ పార్టీల అబిప్రాయాలను తీసుకోవడానికి గాను ఈ సమావేశం జరగబోతోంది. వచ్చే నెల పదో తేదీలోగా ఈ సమావేశాన్ని నిర్వహించే అవకాశం వున్నట్లు సమాచారం. అయితే, ఈ విషయంపై ఇప్పటికే టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు ఎందుకు అఖిలపక్ష సమావేశం పెట్టలేదని ప్రశ్నించారు. తాజాగా, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ కూడా దీనిపై కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేకు సలహా కూడా ఇచ్చారు. వీటన్నింటిని దృష్టిలో వుంచుకొని కేంద్ర మంత్రుల బృందం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరీ విభజన మార్గదర్శికాలాపై ఆయా పార్టీలు ఎలా స్పండిస్తాయన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. యూటర్న్ తీసుకునే వారెందరో.. యథాతథంగా వుండవారెందరో మరోసారి తేలనుందన్న మాట.