మరో ఫేస్ బుక్ అరెస్ట్!

manmohanప్రధాని మన్మోహన్ సింగ్, కేంద్రమంత్రి కపిల్ సిబల్, సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ తదితరులపై విద్వేషపూరిత అంశాలు సోషన్ నెట్ వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ లో పోస్ట్ చేసినందుకు ఆగ్రా పోలీసులు ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. సంజయ్ చౌధురి అనే వ్యక్తిని అగ్రాలోని దయాల్ బాగ్ వద్ద అరెస్ట్ చేసి అతని వద్దనుంచి లాప్ టాప్, సిమ్ కార్డు, డేటా కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ద్వారా జరిపే భావవ్యక్తీకరణపై బలప్రయోగంగా ఈ అరెస్ట్ ను కొందరు చూస్తున్నప్పటికీ తాము మాత్రం తమకందిన సమాచారం మేరకు ఈ వ్యాఖ్యలను మత విద్వేషాలను రెచ్చగొట్టేవిగా ఉన్నట్టు భావించే అరెస్ట్ కు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు.