ఏపీలో అతీగ‌తీ లేని అన్న‌క్యాంటిన్లు

Anna-Canteens
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో తెలుగుదేశం ప్ర‌భుత్వం అధికారంలోకి వచ్చాక అత్యంత ప్రాధాన్యత గా ప్రకటించిన పథకం అన్న క్యాంటీన్లు.ఏపీ లో ప్రమోగాత్మకంగా మొదట ఐదు చోట్ల ఈ ప‌థ‌కాన్ని అమ‌ల్లోకి తీసుకోస్తామ‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.. పేద , బలహీన వర్గాల వారికి పోషకాహర భోజనాన్ని తక్కువరేట్లకే ఇవ్వాలని చంద్రబాబు సర్కారు తొలి కేబినెట్ లో నే ఆమోద ముద్ర వేసింది..ఈ పథకాన్ని అమలు చేయడానికి అవసరమైన గ్రౌండ్ వర్క్ చేయడానికి మంత్రులు నారాయణ, పత్తిపాటి పుల్లారావు, పౌరసరఫాల శాఖ మంత్రి పరిటాల సునీతల‌కు అప్ప‌గించింది ప్ర‌భుత్వం…

అధినేత ఆదేశాలతో త‌మిళ‌నాడులో సక్సెస్ ఫుల్ గా నడుస్తున్న అమ్మ క్యాంటీన్ల పరిశీలనకు మంత్రుల బృందం మూడు సార్లు చెన్నైకు కూడా వెళ్లొచ్చారు..మొద‌టివిడ‌త‌గా రాష్ట్రంలోని విశాఖ‌,గుంటూరు,అనంత‌పురం,తిరుప‌తతిల్లో మొత్తం 35చోట్ల క్యాంటిన్లు ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించారు..విశాఖ‌ప‌ట్నంలో 15, గుంటూరు 10, తిరుప‌తిలో 5, అనంత‌పురంలో 5 అని ప్ర‌క‌ట‌న‌లు కూడా చేసేశారు..దీనికి సంబంధించి మెనూ కూడా త‌యారుచేసింది స‌ర్కార్.ఉద‌యం టిఫిన్ లో ఇడ్లి,ఉప్మా,పొంగ‌ల్ ను 5ఐదు రూపాయిల‌కు,మధ్యాహ్నం భోజ‌నంలో సాంబారన్నంగానీ పులిహోర గానీ,పెరుగ‌న్నం గానీ ఏదైనా ఏడున్న‌ర‌కే ఇవ్వ‌వాల‌ని నిర్ణ‌యించారు…రాత్రి ఆహారంగా రెండు చ‌పాతీలను ఏడున్న‌ర రూపాయిల‌కే అందిస్తామ‌ని ప్ర‌క‌ట‌న‌లు కూడా చేసారు..అంతా అయిపోయింది..ఇంకేముంది అక్టోబర్ రెండు నుంచి అన్న క్యాంటీన్ల టేస్ట్ చూడొచ్చు అంటూ ప్రకటనలు కూడా చేశారు.అయితే ప్రకటనలో చూపిన ఉత్సాహం ఆచరణలో మాత్రం క‌న‌బ‌డ‌లేదు…ఆర్థిక ఇబ్బందుల‌తో అన్న‌క్యాంటీన్ల ప‌థకం ఆల‌స్య‌మ‌వుతుంద‌ని ప్ర‌భుత్వ‌వ‌ర్గాల స‌మాచారం.

అన్న క్యాంటీన్లు ఎప్పుడు పెడ‌తారో న‌ని పేద ప్ర‌జ‌లు ఆశ‌గా చూస్తున్నారు. మాట ఇచ్చిన ప్ర‌కారం ఏపి ప్ర‌భుత్వం వీటిని ఎప్పుడు ప్రారంభిస్తుందో చూడాలి.