హోలీ సంబరాలు జరుపుకున్న చంద్రబాబు..

cm-holiహోలీ సంబరాల్లో తెలుగు రాష్ట్ర ప్రజలు మునిగితేలుతున్నారు..ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇరు రాష్ట్రాల ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఎన్టీఆర్ భవన్ లో హోలీ సంబరాల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ కులాలు, మతాలు, ప్రాంతాలకతీతంగా, చిన్నాపెద్ద అంతా కలిసి ఆడుకునే ఏకైన పండుగ హోలీ అని అన్నారు. ప్రతీ ఒక్కరి జీవితం రంగులమయం అవ్వాలనేదే ఈ పండుగ ఉద్దేశమని చెప్పారు.