ఏపీ నిరుద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త

పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రైవేట్ సంస్థల్లో 75శాతం స్థానికులకు ఉద్యోగాలు కల్పించేలా ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయి మెంట్ ఆఫ్ లోకల్ క్యాండేట్స్ ఇన్ ది ఇండస్ట్రీస్ యాక్ట్‌ను ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది.

అంటే ఇకపై రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ సంస్థల్లో 75శాతంమంది స్థానిక యువతకు ఉద్యోగాలు ఇస్తారనమాట. ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ ఉద్యోగాలకు సంబంధించి హామీ ఇచ్చారు. వైసీపీ అధికారంలోకి వస్తే.. స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. అధికారంలోకి రాగానే ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.