దిగొచ్చిన ఏపీ ప్రభుత్వం.. కాపు రిజర్వేషన్ బిల్లుకు గ్రీన్ సిగ్నల్

kapu-mudragada-deekshaఎట్టకేలకు ఏపీ ప్రభుత్వం దిగొచ్చింది. ముద్రగడ దీక్ష ఫలించింది. వచ్చే సెప్టెంబర్ లో కాపు రిజర్వేషన్లపై శాసనసభలో బిల్లు తీసుకొస్తామని..
ఇప్పుడు దీక్ష విరమించాలని ముద్రగడ ముందు ప్రపొజల్ పెట్టింది చంద్రబాబు ప్రభుత్వం. మరోవైపు, ముద్రగడ మాత్రం దీక్ష విరమించేందుకు ససేమిరా అంటున్నారు. కాపు రిజర్వేషన్ పై ప్రభుత్వం తీసుకురానున్న బిల్లుపై ప్రభుత్వం లిఖితపూర్వక హామీ ఇస్తేనే దీక్షని విరమిస్తానని ముద్రగడ
స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ముద్రగడ దీక్ష 6వ రోజుకి చేరడంతో ఆయన ఆరోగ్యం విషమించడం. దీనికి తోడు ఏపీలోని కాపునేతలంతా ఒక్క తాటిపైకి వస్తుండటంతో కాపు రిజర్వేషన్ పై ముద్రగడకి హామీ ఇవ్వక తప్పని పరిస్థితి చంద్రబాబు ప్రభుత్వానికి ఎదురైంది. మరి.. ముద్రగడ డిమాండ్ చేస్తున్నట్టు కాపు రిజర్వేషన్ బిల్లుపై ఏపీ ప్రభుత్వం లిఖిత పూర్వక హామీ ఇస్తుందా.. ? లేదా.. ?? అనేది చూడాలి. అదే జరిగితే.. ముద్రగడ దీక్షని విరమించినట్టే.