అందుకే.. ఏపీ ‘సన్ రైజ్ స్టేట్’ !

తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేష్’ను ‘సన్ రైజ్ స్టేట్’ అనిపిలుస్తున్నారు. ఈ నినాదం వెనక అసలు నిజాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలియజేశారు. ఆంధ్రప్రదేష్ రాష్ట్రం తూర్పు తీరంలో ఉండడంతో సూర్యుడు ఇక్కడి నుంచే ఉదయిస్తాడు. అందుకే ఈ రాష్ట్రానికి సూర్యుడే అతిపెద్ద బ్రాండ్ అంబాసిడర్ అని చంద్రబాబు అన్నారు. ఈ కారణంగానే “సన్ రైజ్ స్టేట్” అనే నినాదం ఇచిన్నట్టు క్లారిటీ ఇచ్చారు.

ఆదివారం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన సూర్యారాధన కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. “సూర్యునికి అన్ని ప్రాంతాలు, మతాలలో ప్రాధాన్యత ఉంది. అరబ్ దేశాల్లో సూర్యుడ్ని షమ్స్ పేరుతో ఆరాధించే సంస్కృతి ఉంది. సూర్యారాధన, జలహారతి, అమ్మకు వందనం కార్యక్రమాలు ప్రకృతి ఆరాధనలో భాగమని” తెలిపారు.