షీలాదీక్షిత్ పై క్రేజీ‘వార్’

SHEILA-KEJRIWALగత కొద్దికాలంగా జాతీయ నాయకులపై అవినీతిని ఆరోపణలు చేస్తూ.. వారి గుండెల్లో రైళ్ళు పరుగెత్తిస్తున్న ఆమ్ ఆద్మీపార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తాజాగా మరొక ఆసక్తికరమైన అంశాన్ని లేవనెత్తారు. ఈ సారి దేశ రాజధాని ఢీలీ సీఎం షీలాదీక్షిత్ పై తన బాణాన్ని ఎక్కుపెట్టారు. విద్యుత్ సర్ ఛార్జీలు పేరుతో ప్రజలపై అదనపు భారం మోపుతుందని కేజ్రీవాల్ ఆరోపించారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించే అవకాశం ఉన్నా ఢిల్లీ సీఎం అవేమి పట్టించుకోకుండా.. సామాన్య ప్రజల దగ్గర బలవంతంగా కరెంట్ బిల్లులు వసూలు వేస్తున్నారని మండిపడ్డారు.

అనిల్ అంబానీ, టాటా గ్రూపులకు చెందిన విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్ లు) లాభాల్లో ఉన్న.. తమకు నష్టాలు వచ్చినట్లు దొంగలెక్కలు చూపిస్తున్నాయని… వాటికి షీలా దీక్షిత్ అండగా నిలిచారని ధ్వజమెత్తారు. ఈ కంపెనీల లావాదేవీలపై కాగ్ తో ఆడిట్ జరిపించాలని, అనీల్ అంబానీపై కేసు నమోదు చేయాలని క్రేజివాల్ డిమాండ్ చేశారు.

2010-11లో ప్రైవేట్ డిస్కమ్ లు తమకు రూ.630 కోట్ల నష్టాలు వచ్చినట్లు రికార్డుల్లో తప్పుడు లెక్కలు చూపి, వాటిని పూడ్చుకోవడానికి చార్జీలు పెంచాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాయి. 2010లో ఢిల్లీ విద్యుత్ నియంత్రణ సంస్థ (డీఈఆర్సీ) చైర్మన్గా ఉన్న బ్రిజేందర్ సింగ్ ఆ కంపెనీల లావాదేవీలపై విచారణ జరిపించారు. వాటికి నష్టాలకు బదులు రూ.3,577 కోట్ల లాభం వచ్చినట్లు విచారణలో తేలింది. దీంతో టారిఫ్ లో 23 శాతం తగ్గించాలని ఆయన 2010 మే 5న ఆదేశాలు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. అయితే డిస్కమ్ ల ఒత్తిడిపై షీలా జోక్యం చేసుకుని ఆ ఆదేశాలను విడుదలకు ముందురోజు నిలిపేయించారు’ అని కేజ్రీవాల్ వివరించారు. బ్రిజేందర్ సింగ్ రిటైర్మెంట్ అనంతరం షీలా తనకు అనుకూలంగా వ్యవహరించే పీడీ సుధాకర్ అనే అధికారికి ఆ పదవిని కట్టబెట్టారని.. ఈనేపథ్యంలో విద్యుత్ ఛార్జీలు రెండు రెట్లు పెరిగాయని క్రేజివాల్ ఆరోపించారు.