అసద్ కు బెయిల్

Asaduddin1ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి సంగారెడ్డి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వరుసుగా రెండు సార్లు ఆయన బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైన విషయం తెలిసిందే. 2005లో ఓ ప్రార్ధనామందిరం వ్యవహారంలో అప్పటి కలెక్టర్ ను దూషించిన కేసులో ఆయనకు ఈరోజు బెయిల్ మంజూరు అయ్యింది. రూ. 10 వేలు, ఇద్దరు వ్యక్తుల పూచీకత్తుతో న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.

ఈ కేసుకు సంబంధించి సంగారెడ్డి ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ కోర్టు అసదుద్దీన్ కు14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అసద్ను విడుదల చేయాలనికోరుతూ మెదక్, ఆదిలాబాద్, హైదరాబాద్ల బంద్కు కూడా ఎంఐఎం పిలుపునిచ్చింది. పలు అవాంఛనీయ సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో తిరిగి బెయిల్ కోసం అసద్ తరుపున న్యాయవాది రఘునందన్రావు గురువారం సంగారెడ్డి కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ను మన్నించిన కోర్టు అసద్ కు  బెయిల్ మంజూరు చేసింది.