కమలానంద భారతికి బెయిల్

No-bail-for-Kamalananda (1)అదిలాబాద్ నిర్మల్ సభలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ హిందూ దేవతలు, హిందువులపై చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన హిందూ ధర్మరక్షణ సమితి ప్రతినిధి స్వామి కమలానంద భారతికి బెయిల్ లభించింది. నాంపల్లి కోర్టు ఆయనకు ఈరోజు (శనివారం) బెయిల్ మంజూరు చేసింది. అనుమతి లేకుండా హైదరాబాద్ విడిచి వెళ్లరాదని కమలానంద భారతిని న్యాయస్థానం ఆదేశించింది. కర్నూలు జిల్లా శ్రీశైలంలో అక్బర్ పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా కమలానంద భారతి అరెస్టై చర్లపల్లి జైలులో ఉన్న విషయం తెలిసిందే.