’అన్నా..’ ను వాడుకొంటున్నాడు.. !!

'BJP Must Apologise,' Says Arvind Kejriwal on Ad Depicting Anna Hazareరాజకీయాలతో దేశ రాజధాని ఢిల్లీ వేడెక్కుతోంది. ఎన్నికలు దగ్గరపడుతోన్న కొలది మరింత ఉత్కంథ నెలకొంటోంది. నేతలు వ్యూహాలు – ప్రతి వ్యూహాల్లో మునిగిపోయారు. ఏ మాత్రం సంధు దొరికినా ప్రత్యర్థులపై సటైర్లు వేస్తున్నారు. ఆప్ – భాజాపా మధ్య ఇది మరి కాస్త ఎక్కువగానే వుంది. తాజాగా, భాజపా క్షమాపణలు చెప్పితీరాలని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో.. శుక్రవారం భాజపా కేజ్రీవాల్‌ను విమర్శిస్తూ ప్రధాన వార్తా పత్రికల్లో ప్రకటనలు ఇచ్చింది. ఆ ప్రకటనలో అన్నా హజారే చిత్రాన్ని ఉపయోగించడంతోపాటు, ఆయన చిత్రానికి పూలమాల వేశారు. దీనిపై అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ సంప్రదాయం ప్రకారం చనిపోయిన వారి చిత్రాలకు మాత్రమే పూలదండలు వేస్తామని పేర్కొన్నారు. ఈ చర్యకు భాజపా క్షమాపణలు చెప్పి తీరాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు.

భాజాపా క్షమాపణలు చెప్పడం, చెప్పకపోవడం అటుంచితే.. క్రేజీవాల్ మాత్రం అన్నాహజారేను బాగానే వాడుకొంటున్నాడు. ఆయన దగ్గరే శిష్యరికం చేసిన క్రేజీవాల్.. గురువును వాడకోవడం అందరినీ ఆకర్షిస్తోంది. క్రేజీ వాదనను హజారే వ్యతిరేకించలేని పరిస్థితి. మరోవైపు, కమలం నేతలూ.. క్రేజీపై కత్తులు దూస్తోంది. ఆప్ ప్రచారంలో.. భాజాపా సీఎం అభ్యర్థి కిరణ్ భేడీ ఫోటోలు ఉపయోగించుకోవడం.. ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

మొత్తానికి.. సామాన్యుడి పార్టీ, భాజాపాకు గట్టిగానే పోటీ ఇచ్చే పరిస్థితి నెలకొంది. మరీ.. క్రేజీ డిమాండ్ చేసిన విధంగా.. అన్నాహజారే విషయంలో.. భాజపా క్షమాపణలు చెబుతుందో.. ? లేదో .. వేచి చూడాలి.