టీఆర్ఎస్ ఎంపీతో బోయ‌పాటి సినిమా

Boyapati-mallareddyటైటిల్ చూసి నిజమా అనే సందేహం కలుగుతుందా..అయితే ఈ స్టోరీ చదవండి మీకే తెలుస్తుంది..గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌పున మ‌ల్కాజ్‌గిరి ఎంపీ గా విజయం సాధించిన మ‌ల్లారెడ్డి , ఈ మధ్యనే అధికార పార్టీ తెరాస‌లో చేరిన సంగతి తెలిసిందే..తాజాగా నిన్న హరిత హారం కార్యక్రమం తన కాలేజ్‌లో నిర్వ‌హించాడు. ఈ కార్య‌క్ర‌మానికి తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో పాటు ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను హాజ‌ర‌య్యారు. కార్య‌క్ర‌మంలో భాగంగా ఏర్పాటు చేసిన వేదిక‌పై మల్లారెడ్డి అదిరిపోయే డైలాగ్స్ చెప్పడమే కాదు కొన్ని సినిమా పాట‌ల‌కు రెచ్చిపోయి చిందులేశాడు..

ఈ డైలాగ్స్ విన్న కేటీఆర్ ముసి ముసి న‌వ్వులు న‌వ్వుకుంటూ బోయ‌పాటితో మా ఎంపీకి ఏదైనా సినిమాలో ఛాన్స్ ఇవ్వండి సార్ అంటూ స్టేజ్ మీద అనడం తో అక్కడున్న వారంతా ఘొల్లున న‌వ్వుకున్నార‌ట‌. మరి బోయపాటి ఛాన్స్ ఇస్తాడో లేదో చూడాలి.