21 నుండి బడ్జెట్ సమావేశాలు

Parliament_budget_sessionఈ నెల 21 నుంచి మే 10 వరకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. తొలి విడత బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 21 నుంచి మార్చి 22 వరకు జరగనున్నాయి. రెండో విడత బడ్జెట్ సమావేశాలు ఏప్రిల్ 22 నుంచి మే 10 వరకు జరగనున్నాయి. 26న రైల్వే బడ్జెట్, 27న ఎకానమీ సర్వే, 28న సాధారణ బడ్జెట్ సమావేశాలు జరగనున్నట్లు సమాచారం. కాగా, ఈరోజు సాయంత్రం కేంద్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ సమావేశంలో జస్టిస్ వర్మ నివేదిక ఆధారంగా లైంగిక వేధింపుల బిల్లు అమలుకు అర్డినెన్స్ అంశంపై చర్చించనున్నారు.