అత్యాచార నేరస్తులకు మరణశిక్షే..!

delhi-gang-repe--ordinaceగత యేడాది దేశరాజధాని ఢిలీలో 23 ఏళ్ళ యువతి (నిర్భయ) సామూహిక అత్యాచారానికి గురైన నేపథ్యంలో..  నిందితులను ఉరితీయాలన్న దేశ ప్రజానీకం డిమాండ్ కు ప్రభుత్వం తలవంచింది. అత్యాచార కేసుల్లో బాధితురాలు మరణించినా లేదా శాశ్వతంగా అచేతనావస్థలో ఉండిపోయినా నేరస్థులకు మరణశిక్ష విధించాలనే ఆర్డినెన్స్ ను కేంద్రం ఆమోదించింది. కేంద్రమంత్రిమండలి నిన్న (శుక్రవారం) ప్రత్యేకంగా సమావేశమై ఈ బిల్లుకు ఆమోద్రముద్ర వేసింది. అంతేకాకుండా తక్షణమే అమలులోకి తీసుకురావడానికి వీలుగా.. ఆర్డినెన్స్ ను రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ వద్దకు కేంద్రం పంపించనుంది. సమావేశ అనంతరం న్యాయశాఖ మంత్రి అశ్వనికుమార్ విలేకర్లతో మాట్లాడుతు… ‘ఇది ఒక అభ్యుదయ చట్టమని’ పేర్కిన్నారు. ఢిల్లీ ఘటన తర్వాత యావత్ దేశం చూపించిన స్పందనకు అనుగుణంగా ఈ ఆర్డినెన్స్ తయారైందని తెలిపారు.

ఢిల్లీ అత్యాచార ఘటన అనంతరం ఏర్పాటైన జస్టిస్ వర్మ కమిటీ సిఫార్సుల ఆధారంగా ఈ ఆర్డినెన్స్ రూపొందింది. అయితే కేంద్రప్రభుత్వం జస్టిస్ వర్మ కమిటీ సిఫార్సుల కన్నా కొంత ముందుకు వెళ్లి మరణశిక్షకు మద్దతు పలకటం విశేషం. ఈ బిల్లుపై దేశ ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తున్నారు.