అమరావతిలో అతిపెద్ద ఎన్టీఆర్ విగ్రహం

cbn
‘ఉన్న‌తమైన ఆశ‌యాల కోసం శ్ర‌మించిన వ్య‌క్తి ఎన్టీఆర్’అని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. రెండో రోజు మహానాడులో మాట్లాడినచంద్రబాబు.. ఎన్టీఆర్ గొప్పదనాన్ని గుర్తు చేసుకున్నారు. తెలుగు జాతికి ఎన్టీఆర్‌ ఆరాధ్య దైవమని, ఉన్నతమైన ఆశయాల కోసం జీవించిన వ్యక్తి ఎన్టీఆర్‌ అనికొనియాడారు. సమాజమే దేవాలయం… ప్రజలే దేవుళ్లని ఎన్టీఆర్‌ చెప్పారని, పేదరికంలేని సమాజ స్థాపనే ఎన్టీఆర్‌కు నిజమైన నివాళని చెప్పుకొచ్చారు బాబు.

అలాగే, తెలుగు జాతికి ప్రతీక వున్న ఎన్టీఆర్ అని, తెలుగువారి ఆత్మగౌరవ స్ఫూర్తి పేరుతో చరిత్రలో నిలిచిపోయే ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని, కొత్త రాజధాని అమరావతిలోనే దాదాపు 115.5 అడుగుల ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఏర్పాటుచేస్తామని ప్రకటించారు బాబు. అలాగే, ‘అన్న’గారి పేరుతో మున్ముందు మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని కూడా ఈ సందర్భంగా వెల్లడించారాయన.