ఏపీలో అది పనికిమాలిన పార్టీ

cbn (25)
అభివృద్ధికి అడ్డుపడుతున్న పనికిమాలిన పార్టీ వైఎస్సార్సీపీ అని విమర్శించారు సీఎం చంద్రబాబునాయుడు. కృష్ణా జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో గోదావరి-కృష్ణా నదుల పవిత్రసంగమం వద్ద పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, అభివృద్ధికి అడ్డుపడుతున్న ఆ పార్టీని చూసి వెనుకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. ఏడాదిలో ‘పట్టిసీమ’ను పూర్తి చేశామన్నారు. ఈ ఏడాదిలోనే గోదావరి, పెన్నా నదుల అనుసంధానం చేస్తామని చెప్పిన బాబు.. ‘పట్టిసీమ’ అసాధ్యమని కొంతమంది అన్నారని, అసాధ్యాన్ని సుసాధ్యం చేశామని వివరించారు. ప్రతిపక్షంగా ఉన్న వైకాపా నేర చరిత్ర కలిగిన పార్టీ అని.. అభివృద్ధిని అడ్డుకోవడమే ఆ పార్టీ నేతల లక్ష్యమన్నాయన.. తనను అడ్డుకోవాలని చూస్తే బుల్లెట్‌లా దూసుకుపోతానన్నారు.