తెలుగు రాష్ట్రాలకు పెడితే ప్రయోజనం ఉండదని..!

కేంద్ర ప్రభుత్వం మరోసారి తెలుగు రాష్ట్రాలకు మొండి చేయి చూపించింది. ఎన్డీయే ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కూడా సౌత్‌కు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు ఏమాత్రం ప్రయోజనం చేకూర్చే కేటాయింపు జరపలేదు. తాజాగా బడ్జెట్‌లో కూడా అదే తీరును కనబర్చడం జరిగింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఓటు బ్యాంకు రాజకీయం చేస్తోందని, ఓట్లు వచ్చే వారికి ఎక్కువ కేటాయింపులు చేయిందని క్లీయర్‌గా తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఎంతగా కేటాయింపు జరిపినా కూడా ఖచ్చితంగా అధికారాన్ని మాత్రం దక్కించుకోలేదు.

ఒకటి రెండు సీట్లు కూడా అధనంగా సాధించలేవు. అందుకే తెలుగు రాష్ట్రాల్లో పెట్టే బదు ఇతర రాష్ట్రాల్లో పెడితే ఎక్కువ ఓట్లు మరియు సీట్లు వస్తాయని ఎన్డీయే కూటమి భావించింది. ప్రధాని మోడీ మరియు అమిత్‌ షా ఇదే విషయాన్ని ఆలోచించి, ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి ఉంటారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ విషయాన్ని పక్కన పెడితే ఏపీలో టీడీపీ ఎన్డీయే మిత్రపక్షంగా ఉంది. టీడీపీ అయినా కొన్ని నిధులు తెచ్చుకుంటుందని భావించారు. కాని ఏపీకి కూడా మోడీ అండ్‌ కో మొండి చేయి చూపించడం జరిగింది.