రష్యా బయలుదేరిన చంద్రబాబు

chandrababu
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు రష్యా పర్యటనకు బయలుదేరారు. గన్నవరం ఎయిర్ పోర్టులో ఢిల్లీ ఫ్లైటెక్కిన చంద్రబాబు ఢిల్లీ చేరుకున్నారు. ఆ తర్వాత అక్కడి విమానాశ్రయంలో ఆయన రష్యా విమానం ఎక్కుతారు. తన పర్యటనలో తొలుత కజకిస్థాన్ రాజధాని అస్తానాలో దిగుతారు. అక్కడి అంతర్జాతీయ స్థాయి నిర్మాణాలను పరిశీలిస్తారు. అక్కడ పర్యటన ముగించుకున్న తర్వాత ఆయన రష్యా నగరం ఎకటెరిన్ బర్గ్ చేరుకుంటారు. తిరిగి ఈ నెల 13న ఆయన తిరుగుపయనమవుతారు. మొత్తం ఐదు రోజుల పాటు సాగే ఈ పర్యటన నవ్యాంధ్రకు పెట్టుబడుల సాధించడమే లక్ష్యంగా సాగనుంది