కాంగ్రెస్ పార్టీ ‘ప్రైవేట్ బిల్’ డ్రామా !!

cbn (27)
కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ పార్టీ డ్రామాలు మొదలుపెట్టిందని విమర్శించారు చంద్రబాబు. చరిత్రలో ఎప్పుడైనా ప్రైవేట్ మెంబర్ బిల్లు చట్టంగా మారిందా? అని ప్రశ్నించి చంద్రబాబు.. బిల్లు వీగిపోతుందని తెలిసినా కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు ప్రారంభించిందని, మొసలికన్నీరు కారుస్తోందని మండిపడ్డారు. విభజన రోజున సరిగ్గా వ్యవహరించి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి తలెత్తి ఉండేదా? అని నిలదీసిన చంద్రబాబు.. చేయాల్సిందంతా చేసి కాంగ్రెస్, ఇప్పుడు నాటకాలాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.