సంచలన తీర్పు : ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ

దశాబ్ధాల కాలం నాటి అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టు అందరికీ ఆమోద్యయోగ్యమైన తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా సుప్రీం మరో సంచలన తీర్పును వెలువరించింది. సమాచార హక్కు చట్ట పరిధిలోకి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, ఆయన కార్యాలయాన్ని తీసుకొస్తూ సంచలన తీర్పునిచ్చింది. న్యాయ వ్యవస్థను మరింత పారదర్శకంగా మలిచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు న్యాయస్థానం తెలిపింది.

జేఐ జస్టిస్‌ రంజన్‌ గొగొయి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. సీజేఐ కార్యాలయం ఆర్‌టీఐ పరిధిలోకి వస్తుందంటూ 2010 జనవరిలో దిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించింది. దాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్‌, కోర్టుకు చెందిన కేంద్ర ప్రజా సమాచార అధికారి సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేశారు. వాటిపై విచారణ నిర్వహించిన న్యాయస్థానం ఈ ఏడాది ఏప్రిల్‌ 4న తీర్పును రిజర్వులో ఉంచింది. తాజాగా తుదితీర్పును వెలువరించింది.