రాహుల్ గాంధీతో చిరు భేటీ!

chiru-rahul-gandhiఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి ఈరోజు (సోమవారం) సాయంత్రం భేటీ అయ్యారు. ఈ భేటీలో ముఖ్యంగా పర్యాటక శాఖ ద్వారా యువతకు ఉద్యోగాల కల్పనపై చిరంజీవి రాహుల్ తో చర్చించినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా రాహుల్ గాంధీ రాజకీయాల్లో యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రకటించిన నేపథ్యంలో… కాంగ్రెస్ లోకి యువతను తీసుకురావడంపై  వీరి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం.

కాగా, కేంద్రం తెలంగాణ అంశంపై నిర్ణయం ప్రకటించనున్న నేపథ్యంలో.. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా మెగాస్టార్ రాజకీయంగా ఇంకా పైకి స్థాయికి చేరువయ్యేందుకే… తన వంతు ప్రయత్నంలోని భాగంగానే యువనేత రాహుల్ గాంధీని కలిశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.