అర్జెంట్ మీటింగూ.. టార్గెట్ చంద్రబాబూ.. !!

Park Hyatt meeting

ఆంధ్రప్రదేష్ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందా.. ? అవుననే అంటున్నారు.కాపునేతలు. కాపు ఉద్యమనేత ముద్రగడని అరెస్ట్ చేయడం అరాచక చర్యగానే కాపులు భావిస్తున్నట్టు కనిపిస్తోంది. అందుకే అరాచక ప్రభుత్వంపై ఉద్యమానికి సిద్ధమయ్యారు. అత్యవసర మీటింగుని నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని హోటల్ పార్క్ హయత్ లో కాపు నేతలు అత్యవసరంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో చిరంజీవి, బొత్స, పల్లం రాజు, దాసరి, అంబటి రాయుడు, సి .రామచంద్రయ్య … తదితరులు హాజరైనట్టు తెలుస్తోంది.

కొద్దిసేపటి క్రితం (సా.4గం॥లకు) సమావేశం మొదలైంది. ముద్రగడ అంశం, తుని ఘటనలో కాపుల అరెస్ట్ లపై ప్రధానంగా చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. సమావేశం తర్వాత సా.5గం॥లకు అత్యవసర మీటింగులో పాల్గొన్న కాపు నేతలు మీడియా సమావేశంలో పాల్గొననున్నారు. కాపుల పట్ల చంద్రబాబు ప్రభుత్వ వైఖరిని ఈ సమావేశంలో తీవ్రంగా ఖండించే అవకాశం ఉంది. అదేవిధంగా ముద్రగడ అరెస్ట్ నిరసనగా ఇకపై చేపట్టాల్సిన నిరసన కార్యక్రాల షెడ్యూల్ ని కూడా ప్రకటించే అవకాశం ఉంది. మొత్తానికి.. కాపు ఉద్యమం చంద్రబాబు ప్రభుత్వానికి గట్టి షాక్ ఇచ్చేలా కనబడుతోంది.