చిరు ఎఫెక్ట్ : ఏపీ కాపు మంత్రుల రాజీనామా..?

ghanta-srinivas-chiranjeevi-kaapuముద్రగడ ఏపీసోడ్ ఏపీ ప్రభుత్వానికి ఊపిరి ఆడకుండా చేస్తోంది. కాపు రిజర్వేషన్లు, తుని ఘటన అరెస్ట్ లపై ముద్రగడ దీక్ష 6వ రోజుకి చేరింది. ఆయన ఆరోగ్యం కూడా క్షిణించిందని.. వెంటనే చికిత్స అందించకుంటే ప్రమాదమని డాక్టర్లు బులిటెన్ కూడా విడుదల చేశారు. ఈ వార్త చంద్రబాబు ప్రభుత్వానికి వణుకుపుట్టిస్తోంది. మరోవైపు, ఏపీలోని కాపు నాయకులంతా ఏకమయ్యారు. నిన్న (సోమవారం) అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి.. ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. అయితే, తాజాగా మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి రంగంలోకి దిగాడు.

హైదరాబాద్ లో కాపు ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించారు. తాజాగా, చిరంజీవి నేతృత్వంలో సాగిన సమావేశంతో టీడీపీ కాపు నేతల్లో గుబులు మొదలైయ్యింది. ముఖ్యంగా మంత్రి గంటా శ్రీనివాస్ రావు, ఎంపీ ముత్తెం శెట్టి శ్రీనివాస్..తదితరులు గందరగోళంలో పడ్డారు. ముద్రగడకి ఏమైనా అయితే.. కాపుల ద్రోహులుగా మిగిలిపోతామని.. అదే జరిగితే రాజకీయ భవిష్యత్ ఉండని భయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రి గంటాతో సహా మరికొందరు కాపు నేతలు రాజీనామాకు సిద్ధమవుతున్నట్టు సమాచారమ్. కాగా, ముద్రగడ దీక్ష 6వ రోజుకి చేరుకొన్న ప్రభుత్వం మాత్రం కాపు విషయంలో ఎలాంటి హామీ ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు.