ఎం.ఎస్. మృతిపట్ల సీఎంల సంతాపం

ms-naryana
ప్రముఖ హాస్యనటుడు ఎం.ఎస్ నారాయణ మృతిపట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. ఎం.ఎస్ నారాయణ మృతి సినీ పరిశ్రమకు తీరని లోటని కొనియడారు.

ప్రముఖ హాస్యనటుడు ఎం.ఎస్ నారాయణ మృతిపట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. సినీ పరిశ్రమ మంచి నటుడ్ని కోల్పోయిందని ఆయన పేర్కొన్నారు. ఎం.ఎస్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఎం.ఎస్ పార్థీవదేహాన్ని అభిమానులు, సినీ ప్రముఖుల సందర్శనార్థం మధ్యాహ్నం 2 గంటల నుంచి 4గంటల వకు ఫిలింఛాంబర్‌లో ఉంచనున్నారు. రేపు (శనివారం) వికారాబాద్‌లోని వ్యవసాయక్షేత్రంలో ఎం.ఎస్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలియజేశారు..