ఉత్తమ్ చేతిలో.. కేసీఆర్ రాజకీయ సన్యాసం !

CM KCR Challenges Uttam Kumar Reddy
‘మహా’ ఒప్పందాన్ని పూర్తి చేసుకుని తిరిగొచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బృందానికి ఘన స్వాగతం లభించింది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో బేగంపేట్‌ విమానాశ్రాయానికి చేరుకొని సీఎం కేసీఆర్ కి ఘన స్వాగతంపలికారు. దాదాపు 2వేల మంది కళాకారులతో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలతో ఘన స్వాగతంపలికారు.

ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగా సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. “ఈ రోజు గుండెల నిండా సంతోషంగా ఉందని.. మహారాష్ట్ర ప్రభుత్వంతో గోదావరి నదీ జలాల ఒప్పందం సువర్ణాక్షరాలతో లింఖించబడిందన్నారు” అదే సమయంలో టీ-పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఫైరయ్యాడు. తమ్మిడి హట్టిపై 152మీ ఒప్పందం జరిగిందని ఉత్తమ్ చెబుతున్నాడు. ఆ పేపర్ తీసుకొస్తే.. నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. ఇటు నుంచి ఇటే రాజ్ భవన్ కి వెళ్లి రాజీనామాని సమర్పిస్తానని సవాల్ విసిరారు కేసీఆర్. ఉత్తమ్ బండారం మొత్తం బయటపెడతానని హెచ్చరించారు.

ఇక, టీఆర్ ఎస్ రెండేళ్ల పాలన అవినీతి రహితంగా సాగుతుందని, రాబోయే రోజుల్లో బస్సు యాత్రని చేపట్టి.. ప్రతి ఒక్కరిని కలుస్తానని సీఎం కేసీఆర్ తెలిఆరు. మొత్తంగా.. చూస్తే మహా ఒప్పందం తర్వాత తిరిగొచ్చిన కేసీఆర్ ఉత్తమ్ కి సవాల్ కి విసరడం ఆసక్తిగా ఉంది. ఇప్పుడు.. కేసీఆర్ రాజకీయ సన్యాసం ఉత్తమ్ చేతిలో ఉందన్నమాట. మరీ.. ఉత్తమ్ ఏం చేస్తాడో చూడాలి.