కొత్త జిల్లాగా ‘సిరిసిల్ల’.. కేసీఆర్ గ్రీన్ సిగ్నల్

kcr
తెలంగాణ కొత్త జిల్లాల లిస్టులో ‘సిరిసిల్ల’ కూడా వచ్చిచేరింది. ‘సిరిసిల్ల’ కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇప్పటికే కరీంనగర్ జిల్లా నుంచి ‘హుజురాబాద్‌’ కొత్త జిల్లాగా ఏర్పటైంది. ఇప్పుడు ‘సిరిసిల్ల’ కూడా కొత్త జిల్లాగా ఏర్పబోతోంది. ఇక, కరీంనగర్ జిల్లా కరీంనగర్, హుజురాబాద్‌, సిరిసిల్ల జిల్లాలుగా ఏర్పడనుంది.

అంతకుముందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్‌ జిల్లా నేతలతో సమావేశమయ్యారు. క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో జిల్లా మంత్రి ఈటెల రాజేందర్ సహా ఆ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వీరితో పాటు పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు హజరయ్యారు. తీవ్ర మంతనాల అనంతరం ‘సిరిసిల్ల’ని కొత్తజిల్లాల లిస్టులో చేర్చేందుకు కేసీఆర్ ఓకే చెప్పాడు.

‘సిరిసిల్ల’జిల్లాగా ఏర్పడబోతుండటంతో వరంగల్ జిల్లాలోని ‘జనగాం’, మహబూబ్ నగర్ జిల్లాలోని ‘గద్వాల్’ విషయంలో ఆందోళనలు మరింత తీవ్ర తరం అయ్యే సూచనలున్నాయ్. అయితే, సిరిసిల్ల జిల్లా ఏర్పాటు విషయంలో మంత్రి కేటీఆర్ కీలక పాత్ర పోషించినట్టు సమాచారమ్.