బ‌షీర్ బాగ్ లో కాంగ్రెస్ నివాళి

Uttam-Kumar-Reddy-appointedబ‌షీర్ బాగ్ విధ్యుత్ ఉధ్య‌మ కాల్పులు జ‌రిగి 14 యేళ్లు పూర్త‌యిన సంద‌ర్భంగా కాంగ్రెస్ నేత‌లు అమ‌ర వీరుల‌కు ఘ‌నంగా నివాళులు అర్పించారు. బ‌షీర్ బాగ్ లో ని విద్యుత్ అమ‌ర వీరుల స్ధూపం వ‌ద్ద జ‌రిగిన కార్య‌క్ర‌మంలో తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ నేత‌లు పాల్గొన్నారు. విద్యుత్ ఉధ్య‌మంలో అమ‌రులైన బాల‌స్వామి. విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి, రామ‌కృష్ణ ల‌కు నివాళులు అర్పించారు. బ‌షీర్ బాగ్ విధ్యుత్ ఉధ్య‌మం అప్ప‌టి టిడిపి ప్ర‌భుత్వం మెడ‌లు వంచింద‌న్నారు తెలంగాణ పిసిసి చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి. విధ్యుత్ అమ‌ర‌వీరుల స్పూర్తితో నేటి ప్ర‌భుత్వాల అప్ర‌జాస్వామిక విదానాల‌పై పోరాటం చేస్తామ‌న్నారు ఉత్త‌మ్.

బ‌షీర్ బాగ్ విధ్యుత్ ఉధ్య‌మం గొప్ప ప్ర‌జాస్వామ్య ఉధ్య‌మ‌మ‌ని అభివ‌ర్ణించారు ఏ.పి పిసిసి చీఫ్ ర‌ఘువీరా రెడ్డి. 2002 లో విధ్యుత్ ఛార్జీల పెంపును నిర‌శిస్తూ విప‌క్షాలు చేప‌ట్టిన ఆందోళ‌న‌పై చంద్ర‌బాబు స‌ర్కార్ నిరంకుశంగా వ్య‌వ‌హ‌రించింద‌ని గుర్తు చేసారు. ప్ర‌స్తుతం అధికారంలో ఉన్న టిడిపి తో పాటు కేంధ్రంలో ఉన్న బి.జే.పి ప్ర‌భుత్వాల విధానాల్లో ఎలాంటి మ‌ర్పు లేద‌న్నారు. కాంగ్రెస్ ఎలాంటి త్యాగాల‌కైనా సిద్ద‌మ‌న్న ర‌ఘువీరా కేంధ్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల ప్ర‌జా వ్య‌తిరేక విదానాల‌పై విధ్యుత్ అమ‌ర వీరుల స్పూర్తితో పోరాడుతామ‌ని స్ప‌ష్టం చేసారు..

2012 లో జ‌రిగిన విధ్యుత్ ఉధ్య‌మంలో ప్ర‌దాన భాగ‌స్వామిగా ఉన్న కాంగ్రెస్ ప్ర‌జ‌ల బాధ‌లు తెలుసుకుని అధికారంలో ఉన్న 10 యేళ్లు రైతుల‌కు ఉచిత విధ్యుత్ అందించింద‌న్నారు సి.ఎల్పీ నేత జానారెడ్డి. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటంలో కాంగ్రెస్ పార్టీ అగ్ర‌భాగాన ఉంటుంద‌ని తెలిపారు. విధ్యుత్ ఛార్జీల పెంపుపై నాడు చేసిన పోరాటం ఫ‌లితంగా టిడిపి 10 సంవ‌త్స‌రాల పాటు అధికారానికి దూర‌మైంద‌న్నారు..