2014 లో కాంగ్రెస్ దే విజయం : సోనియా

Soniya gandhi Congress AICC presidentసుస్థిరపాలనే కాంగ్రెస్ ప్రధాన ఎజెండా అని, దేశంలో అవినీతిని సమర్థంగా ఎదుర్కొంటామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ పునరుద్ఘటించారు. పార్టీ నుంచి అవినీతి పారదోలాలని, అవినీతికి పాల్పడేవారిని క్షమించే ప్రసక్తే లేదన్నారు. జైపూర్ సదస్సులో అన్ని అంశాలు చర్చించామని సోనియా తెలిపారు. చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని సోనియా స్పష్టం చేశారు. భద్రతతో జీవించడం మహిళల ప్రాథమిక హక్కు అని ఆమె పేర్కొన్నారు. పార్టీలో యువతకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. సామాన్యుల సంక్షేమానికి పార్టీ కృషి చేయాలన్నారు. సోషల్ మీడియాను రాజకీయంగా ఉపయోగించుకోవాలని పార్టీశ్రేణులకు పిలుపునిచ్చారు. ఢిల్లీ గ్యాంగ్‌రేప్ ఘటన దేశాన్ని కుదిపేసిందని తెలిపారు. ప్రజా జీవితంలో ఉన్నవారు మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయటం ఆమోదయోగ్యం కాదన్నారు. భద్రతతో జీవించడం మహిళల ప్రాథమిక హక్కగా సోనియా పేర్కొన్నారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల వల్ల రాజకీయంగా మహిళల ప్రాధాన్యత పెరుగిందన్నారు. మహిళా బిల్లును స్వయంగా పరిశీలిస్తానన్నారు. సోషల్ మీడియాను రాజకీయంగా ఉపయోగించుకోవాలని పార్టీ నేతలకు సూచించారు. టికెట్లు కోరే వారు ఓటమికి కూడా నైతిక బాధ్యత వహించాలని అన్నారు. బడుగు,బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం పార్టీపై ఎంతైనా ఉందని ఆమె చెప్పారు. జైపూర్ సదస్సులో యువత ఎక్కువగా పాల్గొనడం సంతోషకరమని ఆమె తెలిపారు. కొత్తతరం నాయకత్వానికి యువతను ప్రోత్సహించాలని సూచించారు. ప్రధాని మన్మోహన్ నేతృత్వంలో భారత్ ముందుకెళ్తుందని తెలిపారు. నగదు బదిలీ పథకం వల్ల దళారుల అవినీతిని నిర్మూలించవచ్చని ఆమె చెప్పారు. దేశంలోని అన్ని వర్గాలను సమానంగా చూస్తామని తెలిపారు. దేశాభివృద్ధి కోసం యూపీఏ కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పలేదని ఆమె తెలిపారు. కలిసికట్టుగా పని చేస్తే 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తిరిగి విజయం సాధించడం ఖాయమని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ తెలిపారు. పార్టీ విజయాన్ని అందరి విజయంగా భావించాలని ఆమె పిలుపునిచ్చారు.