రైతులకు గుడ్ న్యూస్.. దరఖాస్తు చేసుకున్న 6 నిమిషాలకే..


గాంధీనగర్ లో జీ-20 కేంద్ర ఆర్థికమంత్రుల సదస్సులో భాగంగా… రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI.. ఇన్నోవేషన్ పెవిలియన్ హబ్ ఏర్పాటు చేసింది. రైతులకు తక్షణమే క్రెడిట్ కార్డుల జారీ, రుణాలు అందే పైలెట్ ప్రాజెక్టు సమాచారాన్ని వర్చువల్ గా వివరించింది. రైతులు దరఖాస్తు చేసుకున్న 6 నిమిషాలకే క్రెడిట్ కార్డుల జారీ, రుణ సౌకర్యం కల్పించడం ఈ పైలెట్ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. కార్యక్రమంలో RBI గవర్నర్ శక్తికాంత్ దాస్ పాల్గొన్నారు.

దేశంలో 12 కోట్ల చిన్న, సన్నకారు రైతులు, 8 కోట్ల మంది పాడి రైతుల సాధికారత కోసం మరింత కృషి చేస్తామని ఈ సందర్భంగా RBI ఇన్నోవేషన్ హబ్ CEO రాజేశ్ అగర్వాల్ అన్నారు. పైలెట్ ప్రాజెక్టులో భాగంగా అమూల్ సంస్థ తోపాటు పలు బ్యాంకుల భాగస్వామ్యంతో కార్యక్రమాన్ని అమలుచేస్తామని ఆయన వివరించారు.