కేటీఆర్ ను కలసిన దానం.. ఏంటి కధ ?

daanam

తెలంగాణ ముఖ్యమంత్రి తనయుడు. మంత్రి మంత్రి కేటీఆర్‌ ను కాంగ్రెస్‌ నేత, మాజీ మంత్రి దానం నాగేందర్‌ కలవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపింది. దాదాపు 20 నిమిషాల పాటు కేటీఆర్ తో భేటి అయ్యారు దానం. అయితే ఈ భేటి స్నేహపుర్వగంగా జరిగిందని, ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని చెప్పారు దానం.

నయీమ్ దందాల వెనుక గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ నేతగా ఉన్న దానం నాగేందర్ హస్తం కూడా ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ భేటీకి సహజంగానే ప్రాధాన్యత సంతరించుకుంది. నయీమ్ ఫామ్ హౌస్ పక్కనే దానం ఫామ్ హౌస్ కూడా ఉండటం, పలు సెటిల్ మెంట్లకు దానం నాగేందర్ సహకరించాడని కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో వీరి భేటి టాక్ అఫ్ ది టౌన్ గా మారింది.