కాంగ్రెస్ జైపూర్ డిక్లరేషన్ లో అంశాలు

Congress Jaipur chinthan bythak declaration detailsజైపూర్ ఏఐసీసీ విస్తృతస్థాయి సమావేశంలో కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ ను విడుదల చేసింది. పార్టీ ఈ సమావేశంలో సెక్యులరిజం ఆధారంగా ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించారు. జైపూర్ డిక్లరేషన్ లో అంశాలు ఈవిధంగా ఉన్నాయి ఉన్నాయి:

  • మధ్యతరగతి, యువత లక్ష్యంగా పలు కార్యక్రమాలు
  • భావసారూప్య పార్టీలతో కలిసి పోరాడాలని నిర్ణయం
  • ఎన్నికల, న్యాయవ్యవస్థల సంస్కరణలకు పార్టీ చూపు
  • ప్రభుత్వ పథకాల్లో అవినీతిని అరికట్టేందుకు చర్యలు
  • ముసాయిదాలో ఏపీ ప్రభుత్వం తెచ్చిన ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ పై ప్రస్తావన
  • మహిళలపై దాడులకు పాల్పడేవారిపై కఠిన చట్టాలు
  • చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌లు
  • పోలీస్ రిక్రూట్ మెంట్‌లో 30 శాతం మహిళలకు అవకాశం
  • పార్టీలో అన్ని స్థాయిల్లో 30శాతం మహిళలకు రిజర్వేషన్
  • మహిళలకోసం చట్టాలు, పథకాల గురించి జాతీయ స్థాయిలో ప్రచారం
  • పంచాయితీ స్థాయిలో పార్టీ యూనిట్ ఏర్పాటు
  • పార్టీకి, అనుబంధ సంస్థల మధ్య సమన్వయం
  • ఇక నుంచి పార్టీ నేతల వ్యక్తిగత పనితీరుపై విశ్లేషణ
  • వచ్చే ఎన్నికల నాటికి పార్టీ పునర్ వ్యవస్థీకరణ
  • రాష్ట్ర స్థాయిలో పార్టీకి ఐటీ సేవలు
  • పీసీసీ, డీసీసీ అధ్యక్షుల పదవీకాలం 2 నుంచి 3 ఏళ్లకు పరిమితం