అఖిలపక్షంపై భిన్నాభిప్రాయాలు.. !

all party meetingతెలంగాణ ఏర్పాటుపై మరో ’అఖిలపక్ష సమావేశం’పై ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే నిన్న వెల్లడించిన విషయం తెలిసిందే. నవంబర్ 7వ తేదిన ఈ సమావేశం జరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అయితే, అంతకుముందే విభజనపై కేబినేట్ లో చెప్పిన 11అంశాలపై పార్టీలు తమ అభిప్రాయాన్ని కేంద్రానికి పంపాల్సి వుంటుంది. ఈ అంశాలపై పార్టీలు ఎలా స్పందిస్తాయన్న దానిని అనుసరించి అఖిలపక్ష సమావేశం ఎప్పుడు నిర్వహించాలన్న దానిపై కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణపై కేంద్రం నిర్వహించబోయే అఖిలపక్ష సమావేశంపై దాదాపు అన్ని పార్టీల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీలో ఇది కాస్త ఎక్కువగా వున్నట్లు కనిపిస్తోంది. విభజన ప్రక్రియను ఆపడానికి లేదా ఆలస్యం చేయడానికి ఇది ఒక అవకాశంగా సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు భావిస్తుంటే.. అసలు అఖిలిం ఇప్పుడు అవసరమా.. ? అని టీ-కాంగ్రెస్ నేతలు వాపోతున్నారు. అయినా.. ’అమ్మ’ కరుణ వుందిగా అని ధీమాను ప్రదర్శిస్తున్నారు. ఇక రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ ప్రాంత నేతలు అఖిలపక్షాన్నివ్యతిరేకిస్తుండగా సీమాంధ్ర నేతలు మాత్రం స్పష్టత కోరుతున్నారు. ఇక వైకాపా ఈ సమావేశాన్ని బహిష్కరించే అవకాశాలే ఎక్కువగా వున్నట్లు తెలుస్తోంది. సమైక్యాంధ్ర స్టాండుతో.. ఒక ప్రాంతానికే పరితమైన జగన్ పార్టీకి ఈ సమస్య కాస్త తక్కువగానే వున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమ పార్టీగా పేరొందిన తెరాస స్టాండ్ అందరికీ తెలసిందే.. విభజన అయినా.. అవ్వకపోయినా.. టీ-ఛాంపియన్ గా కంటిన్యూ అవ్వాలన్నదే ఆ పార్టీ అజెండా కనిపిస్తోంది. మిగిలిన సీపీఐ, సీపీఎం, లోక్ సత్తా.. సో.. సో.

కేంద్రం ఉన్నట్టుండి అఖిలపక్ష సమావేశానికి తెరమీదకు తీసుకురావడానికి కారణాలేంటీ.. ? అని ఆలోచిస్తే.. భాజాపా, తెదేపాలను ఇరుకున పెట్టేందుకే అంటున్నారు విశ్లేషకులు. అదేలా అంటే.. విభజనను అడ్డుకొని సీమాంధ్రలో కమలం కాలుమోపాలని చూస్తుందట. ఇక తెదేపా ఏం చెప్పినా.. ఎదో ఒక ప్రాంతంలో కొంతమేర డ్యామేజ్ అయ్యే అవకాశలే ఎక్కువ. మొత్తం మీద అఖిలపక్షం పేరుతో అన్నిపార్టీలకు కేంద్రం విభజన బురదను అంటించే ప్రయత్నాన్ని చేస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.